KNR: సివిల్స్ ఉచిత శిక్షణ కోసం ఆన్లైన్ స్కీనింగ్ టెస్ట్ జూలై 12న నిర్వహించనున్నామని కరీంనగర్ జిల్లా స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లో 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు 0878-2268686 ను సంప్రదించాలని సూచించారు.