KDP: సిద్ధవటం మండలంలోని ఏపీఎస్పీ 11వ పోలీస్ బెటాలియన్ దగ్గర వెలసిన సాయిబాబా మందిరంలో గురువారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నసంతర్పణలో పాల్గొన్నారు.