KMM: ఖమ్మం భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన వారికి బీఆర్ఎస్ నాయకులు అండగా నిలిచారు. అంబేడ్కర్ భవన్, TTDC కేంద్రాల్లో పునరావాసం కల్పించగా, మంగళవారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. MLC తాత మధుసూదన్ బాధితులకు స్వయంగా భోజనం వడ్డీంచారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్యాయంగా బాధితులను రోడ్డున పడేశాయని అన్నారు.