ASR: ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించకపోవడం సరికాదని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్ శ్రీను, కార్యదర్శి జీవన్ కృష్ణ గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో డిగ్రీలో చేరేవారి సంఖ్య రోజు రోజుకు తగ్గుతుందన్నారు. ఆఫ్లైన్ పద్ధతిలో డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలిని డిమాండ్ చేశారు.