ASR: గడచిన 24 గంటల్లో అల్లూరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. కొయ్యూరు మండలంలో అత్యధికంగా 48.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు గురువారం తెలిపారు. వై.రామవరం 42.4, ముంచంగిపుట్టు 40.2, రంపచోడవం 40.4, కూనవరం, చింతూరు మండలాల్లో 32.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 507.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు