SKLM: వినియోగదారులకు రేషన్ సరుకులను సులభతరంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. బుధవారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ చిన్నబడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్మార్ట్ కార్డును పంపిణీ చేశారు. అనంతరం పలు వినాయక మండపాలను దర్శించుకున్నారు.