KDP: కలసపాడు మండలం శంఖవరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ ఇంఛార్జ్ నితేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని చెప్పారు. త్వరలో అమలు చేయబోయే పథకాల గురించి ఆయన వివరించారు.