»Vijay Shanti Said Kcr Family Is Paper Leak Mistakes And They Are Pushing Against Bjp
Vijay Shanti: BRS వాళ్లు తప్పు చేసి బీజేపీపై నెడుతున్నారు
రాష్ట్రంలో మొన్న జరిగిన TSPSC గ్రూప్ 1 పరీక్ష సహా అనేక ఎగ్జామ్స్ లీక్ చేసిన కేసుల్లో కేసీఆర్(KCR) ఫ్యామీలీ హస్తం ఉందని విజయ శాంతి(Vijay Shanti) ఆరోపించారు. వాళ్లు చేసిన తప్పులను పక్కదారి పట్టించేందుకే కొత్తగా ఈ నాటకం ఆడుతున్నారని ఆమె అన్నారు. ఇంకా కేసీఆర్ లక్ష కోట్ల సంపాదన గురించి కూడా ప్రస్తావించారు.
తెలంగాణలో బీఆర్ఎస్(BRS) పార్టీ వాళ్లు తప్పులు చేసీ వాటిని బీజేపీ(BJP) మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత విజయ శాంతి(Vijay Shanti)అన్నారు. మొన్న జరిగిన TSPSC గ్రూప్ 1 ఎగ్జామ్స్ సహా గతంలో జరిగిన అనేక పరీక్షల్లో లీకేజీలతో ఎవరికీ సంబంధం ఉందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రతీ లీకేజీ స్కాంలో కేసీఆర్ ఫ్యామిలీ బంధువులే ఉన్నారని విజయ శాంతి ఆరోపించారు. గతంలో కూడా లీకేజీ కేసులో గ్లోబరీనా సంస్థతో కేటీఆర్ కు సంబంధం లేదా అంటూ నిలదీశారు. వీళ్లు చేస్తున్న తప్పుల కారణంగా గతంలోనే కాదు ఇటీవల కూడా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు గుర్తు చేశారు. కానీ వారి విషయాన్ని మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోదని పేర్కొన్నారు.
ఇప్పుడు తాజాగా టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో ఎగ్జామ్ మొదలైన తర్వాత సంజయ్(bandi sanjay)కు ఎవరో రిపోర్టర్ 11.24 నిమిషాలకు ప్రశ్నపత్రం లీక్ గురించి పంపారని తెలిసిందని పేర్కొన్నారు. అంతకు ముందే అన్ని చానెళ్లలో వార్తలు కూడా వచ్చినట్లు తెలిపారు. ఆ క్రమంలో పేపర్ లీకు గురించి చాట్ చేస్తే ఎలా అరెస్ట్ చేస్తారని మండిపడ్డారు. తాజాగా కేసీఆర్ లక్ష కోట్ల ఆస్తి గురించి సంజయ్ ప్రస్తావించినందుకే వాటిని పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న నాటకమే ఇది అని విజయ శాంతి అన్నారు. ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కవిత కేసును మరిచే విధంగా చేసేందుకు TSPSC లీకేజీ అంశాన్ని తెరపైకి తెచ్చారని గుర్తు చేశారు.
మరోవైపు కేసీఆర్(KCR)కు లక్ష కోట్ల రూపాయల సంపాదన ఎలా వచ్చిందో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ(telangana)లో దోచుకున్న డబ్బును ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ పంచుతున్నాడని విజయ శాంతి ఆరోపించారు. కేసీఆర్ ప్రధాని కావాలని చూస్తున్నాడని..అందుకు ఇతర రాష్ట్రాల్లోని పార్టీలను సపోర్టు చేయాలని కోరుతూ ఫండింగ్ చేస్తానని చెబుతున్నారని విజయశాంతి వ్యాఖ్యానించారు.