Hanuman Jayanthi : హనుమాన్ జయంతి సందర్భంగా రేపు హైదరాబాద్ నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హనుమాన్ శోభయాత్రకు ఇప్పటికే హిందూ సంఘాలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా రేపు హైదరాబాద్ నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హనుమాన్ శోభయాత్రకు ఇప్పటికే హిందూ సంఘాలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
శోభయాత్ర సందర్బంగా 10 వేల మంది పోలీసులు, 850 సీసీటీవీ కెమెరాలు, మౌంటెడ్ కెమెరాలు, మఫ్టీ పోలీసులతో నగరంలో నిఘా పెట్టారు. ఇప్పటికే ట్రాఫిక్ రూట్ మ్యాపును అధికారులు రెడీ చేశారు. గౌలిగూడ రామ మందిరం నుంచి రేపు ఉదయం 11.30 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ తాడ్బండ్ వీరాంజనేయ ఆలయం వద్ద రాత్రి 8 గంటలకు ముగియనుంది. మొత్తం 12 కి.మీలు పాటు ఈ శోభాయాత్ర కొనసాగనుంది. దీనికి కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ దగ్గరి నుంచే కాకుండా నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.
శోభయాత్ర నేపథ్యంలో పోలీసులు పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్, బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్స్ అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. గౌలిగూడ రామమందిర్ నుంచి ప్రారంభమయ్యే యాత్ర -పుత్లిబౌలి క్రాస్ రోడ్స్ నుంచి ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, సీటీవో జంక్షన్, ఇంపీరియల్ గార్డెన్ మీదుగా వెళ్లి తాడ్ బండ్ వీరాంజనేయ ఆలయం వద్ద ముగియనుంది.