E.G: రేపు రాజమండ్రిలో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్) ‘నిధి ఆప్ కే నికట్’ను నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ రాధానాథ్ పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం రాజమండ్రి రూరల్ మండలం కాతేరులోని తిరుమల ఎడ్యుకేషన్ సొసైటీ వద్ద జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.