NLR: ఉదయగిరి 167 బీజీ హైవే కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డివైడర్ను మంగళవారం అర్థరాత్రి ఇసుక టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో డివైడర్ పూర్తిగా దెబ్బతింది. దీంతో ఒక వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంగం నుంచి సీతారాంపురానికి ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.