AKP: గొలుగొండ మండలం ఏఎల్.పురం పంచాయతీలో గొల్లపేట, ఎస్టి కాలనీ చివరి వీధిలో సీసీ రోడ్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ లోచల సుజాత మంగళవారం ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రజలు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా నిర్మాణ పనులను ప్రారంభించినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కృష్ణ పాల్గొన్నారు.