KMR: నస్రుల్లాబాద్తో పాటు సంగెం, మైలారం, నాచుపల్లి గ్రామాల్లో కోతులు ఇళ్లలోకి చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కోతుల దాడిలో పలువురు గాయపడిన ఘటనలు కూడా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతులను పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.