»Celebrities Praise Deva Raja Song From Baby Telugu Movie
Baby: మూవీలోని దేవరాజా పాటపై ప్రముఖుల ప్రశంసలు
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న చిత్రం బేబీ(baby). ఈ మూవీ నుంచి దేవరాజా(Deva raaja) సెకండ్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన పలువురు మ్యూజిక్ డైరెక్టర్లు సహా ఇంకొంత మంది సింగర్స్ ఈ పాటపై ప్రశంసలు కురిపించారు.
మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ(Baby)’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ దేవరాజా(Deva raaja)ను మూవీ టీమ్ విడుదల చేసింది. మొదటి పాటకు పూర్తి భిన్నంగా ఉంటూనే మరో బ్యూటిఫుల్ సాంగ్ అనిపించుకుంది. విడుదలైన వెంటనే ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఈ పాటను మళయాలంలో మోస్ట్ ఫేమస్ సింగర్ గా పేరు తెచ్చుకున్న ఆర్య దయాళ్ చేత పాడించారు. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ గీతాన్ని అభినందించడానికి టాలీవుడ్ లోని ప్రముఖ సంగీత దర్శకులు, సింగెర్స్ స్వయంగా రావడం విశేషం. ఎఫ్ హౌస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నాటి, నేటి సంగీత దర్శకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ లైవ్ కార్యక్రమానికి సీనియర్ సంగీత దర్శకులు(music directors) రాజ్, కోటి, ఆర్.పి పట్నాయక్, ఏం ఏం శ్రీలేఖ, భీమ్స్, మార్క్ కే రాబిన్, ప్రశాంత్ ఆర్ విహారి, చైతన్ భరద్వాజ్, కమ్రాన్ తో పాటు పలువురు సంగీత దర్శకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగర్ ఆర్య దయాల్ తెలుగు అమ్మాయి కాకపోయినా చాలా బాగా పాడిందని ప్రముఖ సంగీత దర్శకులు అన్నారు. తనకు తెలుగులో మంచి భవిష్యత్ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు విజయ్ మ్యూజిక్ కూడా బాగుందని ప్రశంసించారు.
హృదయ కాలేయం, కలర్ ఫోటో, కొబ్బరిమట్ట చిత్రాలతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేశ్(sai rajesh) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మించిన చిత్రం ఇది. త్వరలోనే విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీష తదితరులు నటించారు.
టెక్నీకల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతోన్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, ఎడిటింగ్: విప్లవ్ నైషధం, సినిమాటోగ్రఫీ: ఎమ్ఎన్ బాల్ రెడ్డి, పి.ఆర్.వో: ఏలూరు శీను, జిఎస్.కే మీడియా, కో ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని, నిర్మాత: ఎస్.కే.ఎన్, రచన, దర్శకత్వం: సాయి రాజేశ్.