»Yentamma Song In Youtube Trending Jani Master Choreography Video Viral
Yentamma: యూట్యూబ్ ట్రెండింగ్ లో యెంటమ్మా సాంగ్..కొరియోగ్రఫీ వీడియో కూడా
కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రం నుంచి నిన్న రిలీజైన యెంటమ్మ(Yentamma) సాంగ్ ప్రస్తుతం యూ ట్యూబ్(youtube) టాప్ ట్రెండింగ్ లో ఉంది. మరోవైపు ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ తో చెర్రీ, సల్మాన్ స్టెప్పులు వేస్తున్న వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్(Kisi Ka Bhai Kisi Ki Jaan) మూవీ నుంచి నిన్న విడుదలైన ‘యెంటమ్మా'(Yentamma) సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఈ సాంగ్ ఒక్క రోజులోనే 15 మిలియన్ల వ్యూస్ సాధించగా…దాదాపు 5 లక్షల మంది లైక్ చేశారు. ఇది చూసిన అభిమానులు ఈ పాటలో సల్మాన్ ఖాన్, వెంకటేష్, రామ్ చరణ్ కలిసి స్టెప్పులు వేయడం సూపర్ అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది అయితే సల్మాన్, చెర్రీ వేసిన స్టెప్స్ అదుర్స్ అంటున్నారు.
అయితే ఈ పాటకు ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ కొరియోగ్రఫీ చేశారు. ఈ క్రమంలో జానీ, సల్మాన్, రామ్ చరణ్ ఈ పాటకు ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో జానీ మాస్టర్‌తో కలిసి వీరిద్దరూ కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం చూడవచ్చు. సల్మాన్, రామ్ చరణ్, మ్యాచింగ్ లుంగీ కాస్ట్యూమ్స్ ధరించి స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు. ఆ క్రమంలో డాన్స్ తర్వాత రామ్ చరణ్ నవ్వుతూ సల్మాన్ ఖాన్ కి షేక్ హ్యాండ్ ఇవ్వడం వీడియోలో గమనించవచ్చు. అంతేకాదు ఈ పాటలో ప్రత్యేక పాత్రలో కనిపించిన రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో నిన్న ఇలా రాసుకొచ్చాడు. స్క్రీన్‌పై తన అత్యంత విలువైన క్షణాలలో ఇది ఒకటని వెల్లడించారు. లవ్ యూ భాయ్ అంటూ లవ్ ఏమోజీ సింబల్ యాడ్ చేసి పోస్ట్ చేశారు.
మరోవైపు ఈ పాటలో సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, వెంకటేష్ కాకుండా పూజా హెగ్డే, షెహనాజ్ గిల్, రాఘవ్ జుయల్, పాలక్ తివారీ కూడా ఉన్నారు. యెంటమ్మ పాటను విశాల్ దద్లానీ, పాయల్ దేవ్ ఆలపించగా.. పాయల్ దేవ్ మ్యూజిక్ అందించారు. షబ్బీర్ అహ్మద్ సాహిత్యం అందించిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రానికి గతంలో కభీ ఈద్ కభీ దివాలీ అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదల చేయనున్నారు.