ATP: ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని సూర్య గ్రానైట్ క్వారీలో గురువారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో జిల్లాకు చెందిన కార్మికుడు మృతిచెందాడు. గ్రానైట్ వేస్ట్‌ను రవాణా చేసే డంపర్ బోల్తా పడటంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుడు యాడికి మండలం రాయలచెరువుకు చెందిన రంగయ్య(51)గా గుర్తించారు.