AP: విజయనగరం జిల్లా రాజాంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలింత మృతి చెందింది. బిడ్డకు జన్మనిచ్చి వైద్యం వికటించడంతో బాలింత ప్రాణాలు విడిచింది. అయితే, దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆ హాస్పిటల్ ఎదట బాలింత బంధువులు ఆందోళన చేపట్టారు.