SRPT: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..పోసానికుంట గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి తన ఇంట్లోని మోటర్ పంపును ఆన్ చేశాడు. నీరు రాకపోవడంతో పంపును పరిశీలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిపారు.