AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు మృతి చెందారు. మరణించిన వారిలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ ఉన్నారు. అంతేకాకుండా ఈ కాల్పుల్లో మరో మావోయిస్టు కూడా మరణించినట్లు సమాచారం.