TG: రాష్ట్రం మరోసారి తన ప్రగతిని చాటుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఇవాళ ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాయి. ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.