SRD: పట్టణంలోని మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలను కలెక్టర్ ప్రావీణ్య సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వంటగది, విద్యార్థులకు అందిస్తున్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం శుభ్రమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆమె పేర్కొన్నారు.