భారీబడ్జెట్తో వస్తున్న కుబేర సినిమాకి ఏ లోటు లేదు. డబ్బుకి లోటు లేదు, థియేటర్లకు లోటు లేదు. మంది మార్బలంకి అస్సలు లోటు లేనే లేదు. కానీ ఎన్ని ఉన్నా సరే, సినిమాలో దమ్ము లేకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇది ఈ మధ్య రోజుల్లో ఎన్నో సినిమాల ఫెయిల్యూర్స్ నిరూపించి చూపించాయి.
కానీ, కుబేర ఈ బ్రాకెట్లోనుంచి తప్పించుకున్నట్టుగా కనిపిస్తోంది.
ఓ సినిమాకి రిలీజ్‌కి ముందే సూపర్ క్రేజ్ వచ్చిందంటే దానికి తారాగణం, దర్శకుడు, బ్యానర్ ఇవన్నీ కలిసి వస్తేనే అలాటి క్రేజ్ కుదురుతుంది. 150 కోట్ల భారీ వ్యయంతో ప్రముఖ నిర్మాతలు, ఏషియన్ ఫిల్మ్స్ సునీల్ నారంగ్ అండ్ పుస్కూర్ రామ్మోహనరావు సంయుక్తంగా ధనుష్ అండ్ నాగార్జున కాంబోలో నిర్మించిన కుబేర ఈనెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అయితే గొప్ప విషయమేమిటంటే, సినిమాకి సంబంధించి రెండు పాటలు లిరికల్ వీడియోలు రిలీజ్ చేశారు నిర్మాతలు, దెబ్బకి హోరెత్తిపోయింది సినిమా టాక్. తన యూజవల్ స్టయిల్ కాకుండా ఏదో కొత్తగా ట్రై చేశాడు దర్శకుడు శేఖర్ అనిపిస్తోంది ఈ లిరికల్ వీడియోలు చూస్తుంటే. భారీబడ్జెట్తో వస్తున్న కుబేర సినిమాకి ఏ లోటు లేదు. డబ్బుకి లోటు లేదు, థియేటర్లకు లోటు లేదు. మంది మార్బలంకి అస్సలు లోటు లేనే లేదు. కానీ ఎన్ని ఉన్నా సరే, సినిమాలో దమ్ము లేకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇది ఈ మధ్య రోజుల్లో ఎన్నో సినిమాల ఫెయిల్యూర్స్ నిరూపించి చూపించాయి.
కానీ, కుబేర ఈ బ్రాకెట్లోనుంచి తప్పించుకున్నట్టుగా కనిపిస్తోంది. కథ వరకూ చూస్తే ఓ నిరుపేద, దిక్కూ దివాణం లేనివాడు అమీర్ ఎలా అయ్యాడనేదే ఇందులో మెయిన్ ఎలిమెంట్. దానికి తోడు చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ నిండా కుదిరాయని యూనిట్ సభ్యులు గొప్పగా చెబుతున్నారు. థనుష్కి హిట్స్ మీద హిట్స్ ఉండడంతో అదో అదనపు క్రేజ్. నాగార్జునకి హిట్స్ లేకపోయినా కూడా ఆయన ఆడియన్స్ ఆయనకి ఉన్నారు. పాప్యులారిటీ కూడా సూపర్. వీళ్ళకి తోడు ఆలిండియా హాట్ క్వీన్ రష్మిక కూడా హీరోయిన్ కావడంతో ఆలిండియా స్థాయిలో కుబేర కావాల్సినంత అటెన్షన్‌ని సంపాదించుకుంది. ఇప్పటి వరకూ వదిలిన రెండు లిరికల్ వీడియోలో రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ అల్ లాంగ్వేజెస్‌కి సరిపోయేట్టు ట్యూనింగ్ ట్రిక్ని చాలా ఇంటలిజెంట్‌గా ప్లే చేసి తన మార్కుని మరోసారి ప్రూ చేశాడు.
మరీ ముఖ్యంగా దర్శకుడు శేఖర్ కమ్ములకి సెపరేట్ ఆడియన్స్ ఉన్నారు. ఇంతవరకూ దర్శకుడిగా డిజాస్టర్ చూసిందే లేదు. దీనిక తోడు శేఖర్ కుబేర చిత్రానికి తీసుకున్న స్టోరీ లైన్ కూడా ఏ లాంగ్వేజ్‌లోనైనా సరే ఓ పెద్ద హిట్ ఫార్ములా. ఎక్కువ పాప్యులారిటీ ఉన్న హీరో అనాథగా వచ్చి అంతస్తుల మీద అంతస్తుల స్థాయికి చేరుకుంటే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్క తమిళ్లోనే కాదు, తెలుగులో కూడా ధనుష్‌ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కుబేర సూపర్ హిట్ కావడానికి తిరుగులేకుండా హెల్ప్ అయ్యే అంశాలు. అందుకే నాగార్జున అభిమానులు కూడా బిందాస్‌గా మాట్లాడుతున్నారు, తరువాయి, నాగార్జున తన 100 వచిత్రానికి గ్రౌండ్ వర్క్ చాలా స్ట్రాంగ్‌గా చేస్తున్నారు. యువసమ్రాట్ అక్కినేని నాగార్జున ఆశలన్నీ కూడా కుబేర మీదనే పిన్ అయ్యాయి.