NZB :సిరికొండ మండలం కొండాపూర్లో వీడీసీ భవనానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. వీడీసీ భవనం నిర్మాణానికి రూ.5 లక్షల సాంక్షన్ చేయడంలో కృషి చేసిన వెల్మ భాస్కర్ రెడ్డికి, ఆమోదం తెలిపిన ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు బుచ్చన్నతో పాటు చంద్రగౌడ్, తదితరులు పాల్గొన్నారు.