»Was Degree A Requirement To Get Pms Job Asks Ajit Pawar As Uddhav Raises Question
PM Modi degree: ప్రధాని పదవికి డిగ్రీ కావాలని రాజ్యాంగం చెబుతోందా, మోడీ గెలుపుకు కారణమదే..
ప్రధాని మోడీ డిగ్రీ పైన ఆమ్ ఆద్మీ పార్టీ, ఉద్దవ్ థాకరే, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఎన్సీపీ నేత అజిత్ పవార్ తప్పుబట్టారు. డిగ్రీ గురించి ప్రశ్నించడం సరికాదన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ పైన (PM Modi Degree) విపక్ష నేతలు రాజకీయంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోన్న విషయం తెలిసిందే. ఆయన 2001 నుండి మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా, రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇరవై ఏళ్లుగా దీనిపై ఇంతలా చర్చ సాగలేదు. పాలనా పరంగా, అవినీతిపరంగా విపక్షాలకు ఎక్కడా దొరకడం లేదు మోడీ. ఆయనను ఎలా కార్నార్ చేయాలో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) ప్రధాని డిగ్రీ (PM Modi degree) అంశాన్ని తెరపైకి తెచ్చారు. మద్యం కుంభకోణం కేసును (Delhi excise policy case) పక్కదారి పట్టించేందుకే కేజ్రీవాల్ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారనే వాదనలు ఉన్నాయి. మరో విషయం ఏమంటే.. కేజ్రీవాల్ (Kejriwal), కేసీఆర్ (KCR), థాకరే (uddhav thackeray), కవిత (kavitha), కేటీఆర్ (KTR) తదితరులు మోడీ డిగ్రీని (Modi Degree) సవాల్ చేస్తున్నారు కానీ 23 ఏళ్ళు అధికారంలో ఉన్న మోడీ సంపాదన ఎంత, 9 ఏళ్లుగా అధికారంలో ఉన్న కేజ్రీవాల్, కేటీఆర్, కేసీఆర్, కవిత సంపాదన ఎంత? తేల్చుకుందామా అని ఎవరూ సవాల్ చేయడం లేదని సామాన్యులు సెటైర్లు వేస్తున్నారు. మోడీ సంపాదన రూ.1 లేదా రూ.2 కోట్లు అయితే, వీరి సంపాదన వందలు, వేల కోట్లల్లో ఉంటుందని మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్, ఉద్దవ్ థాకరేలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఈ వ్యాఖ్యలు కేటీఆర్, కవితలకు కూడా వర్తిస్తాయి.
ప్రధాని మోడీ డిగ్రీపై ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తోన్న అనుమానాలను అజిత్ పవార్ (Ajit Pawar) తప్పుబట్టారు. మంత్రుల డిగ్రీ గురించి ప్రశ్నించడం సరికాదని, ఆ మంత్రి ప్రజల కోసం ఏం చేశాడో చూడాలని హితవు పలికారు. 2001 నుండి గుజరాత్ లో, 2014లో దేశ ప్రజలు మోడీ డిగ్రీని చూసి ఓటేశారా అని నిలదీశారు. ప్రధాని కావాలంటే డిగ్రీ కావాలా? అని ప్రశ్నించారు. తద్వారా రాజ్యాంగంలో అలా ఉందా అని అభిప్రాయపడ్డారు. ఆయనకు ఉన్న ప్రజాధరణ గెలిపించిందని చెప్పారు. తొమ్మిదేళ్లుగా ఆయన దేశాన్ని పాలిస్తున్నారని, ఈ సమయంలో డిగ్రీ గురించి చర్చ ఏమిటో.. ఇది సరికాదన్నారు. పాలనాపరంగా మోడీని మనం ప్రశ్నించాలి కానీ, డిగ్రీ సమస్య ఏమిటన్నారు. డిగ్రీలు చేసినవారు అంత బాగా పరిపాలన చేశారా అని అభిప్రాయపడ్డారు.