ATP: గుంతకల్లు కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం మన్య సూక్త హోమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామి వారి మూలమూర్తికి వేకువజామున అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో వాణి, ఆలయ అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు.