»Social Justice Mk Stalin Brings Together Opposition Ahead Of 2024 Election
Opposition Parties నియంత మోదీని దింపేద్దాం.. ఒక తాటిపైకి 21 పార్టీలు
దేశాన్ని సర్వనాశనం చేస్తున్న నరేంద్ర మోదీని సాగనంపేందుకు ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని తరిమికొట్టేందుకు పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. పదేళ్లలో కనిపించని అరుదైన దృశ్యం నేడు కనిపించింది.
భారతదేశ రాజకీయ యవనికపై సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. నియంత, దేశాన్ని సర్వనాశనం చేస్తున్న నరేంద్ర మోదీని (Narendra Modi) సాగనంపేందుకు ప్రతిపక్షాలు (Opposition Parties) ఏకమయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని తరిమికొట్టేందుకు పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. పదేళ్లలో కనిపించని అరుదైన దృశ్యం నేడు కనిపించింది. మోదీ పాలనకు వ్యతిరేకంగా ఏకంగా 21 పార్టీలు జత కట్టాయి. కాషాయ పార్టీని తరిమికొట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు ఐక్య పోరాటానికి (Common Movement) సిద్ధమయ్యాయి. ఈ మేరకు ద్రవిడ మున్నేట్ర కజగమ్ పార్టీ (Dravida Munnetra Kazhagam-DMK) నిర్వహించిన సదస్సుకు శివసేన (ఉద్దవ్ ఠాక్రే), బిజు జనతా దల్, వైఎస్సార్ సీపీ మాత్రమే గైర్హాజరయ్యాయి.
‘సామాజిక న్యాయం’ (Social Justice) పేరిట సోమవారం డీఎంకే (DMK) జాతీయ సదస్సు నిర్వహించింది. వర్చువల్ (Virtual)గా నిర్వహించిన ఈ కార్యక్రమానికి తమిళనాడు, రాజస్థాన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్ (MK Stalin), అశోక్ గహ్లోత్, హేమంత్ సోరెన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తో సహా మొత్తం 21 పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో నేతలంతా ఐక్య పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. ‘దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం నెలకొల్పుదాం’ అని డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. ‘సామాజికంగా, విద్యాపరంగా తిరస్కరణకు గురైన వారికి చేయూత ఇవ్వడమే ఈ న్యాయం. అగ్రవర్ణాల పేదలుగా చెబుతూ కేంద్రం రిజర్వేషన్లు కల్పించడం సామాజిక న్యాయం కాదు. పేదలకు ఆర్థిక సహాయం అందించడాన్ని మేం అడ్డుకోవడం లేదు. అన్ని సామాజిక వర్గాల్లోనూ పేదలు ఉంటారని, ప్రత్యేకించి అగ్రవర్ణాల పేదలు అని చెప్పడం సామాజిక అన్యాయం కదా? కులాలవారీగా జనగణనను కేంద్ర ప్రభుత్వం చేపట్టి వివరాలను బహిర్గతం చేయాలి’ అని స్టాలిన్ డిమాండ్ చేశారు.
ఈ సదస్సులో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ ఎంపీ కే కేశవరావు మాట్లాడుతూ.. ‘అన్ని నియోజకవర్గాల్లో అత్యధికులు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నా ఎన్నికల్లో అగ్రవర్ణాల వారే ఎందుకు గెలుస్తున్నారనే అంశంపై ఆలోచించాలి. దేశంలో ఓబీసీలు, సామాజికంగా వెనుకబడిన ఇతర వర్గాల పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. దీనికి కారణమేమిటనేది మనం ప్రశ్నించుకోవాలి. సామాజిక న్యాయం, సామాజిక వాస్తవాలను అర్థం చేసుకునేలా అణగారిన వర్గాలను చైతన్యపరచాలి’ అని తెలిపారు. కాగా స్టాలిన్ నిర్వహించిన ఈ సదస్సు విజయవంతమవడంతో 2014 ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యతగా పలువురు పేర్కొంటున్నారు. ప్రతిపక్షాలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో స్టాలిన్ విజయవంతం అయ్యారని జాతీయ మీడియా పేర్కొంది. భవిష్యత్ లో ఇలాగే కలిసి వెళ్తారా లేదో చూడాలి.