GNTR: జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బాణాసంచా తయారీ నిల్వల కేంద్రాలపై గుంటూరు పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అగ్ని భద్రత నియమాలు చెల్లుబాటు అయ్యే లైసెన్స్, తప్పనిసరిగా అనుమతులు పాటించాలని నిర్వాహకులకు తెలిపారు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 101/112 కు సమాచారం ఇవ్వాలని కోరారు.