AP: లోక్సభ తొలి దళిత స్పీకర్, టీడీపీ సీనియర్ నేత జీఎంసీ బాలయోగి వర్థంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళులర్పించారు. ‘దళితులు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి జీఎంసీ బాలయోగి అహర్నిశలు కృషి చేశారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. దేశానికి, రాష్ట్రానికి వారు అందించిన సేవలు చిరస్మరణీయం. కోనసీమ ముద్దుబిడ్డ బాలయోగి ఆశయ సాధనకు ప్రతిఒక్కరం కృషిచేద్దాం’ అని ట్వీట్ చేశారు.