NTR: ఇబ్రహీంపట్నంలో ఈనెల 20న తలపెట్టిన ఏపీ మినీ వ్యాన్ మోటార్ ట్రాన్స్పోర్టు యూనియన్ సీఐటీయూ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని మండల కార్యదర్శి ఎం. మహేష్ పిలుపునిచ్చారు. శ్రీ వీరాంజనేయ మినీఆటో ట్రక్ డైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆదివారం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.