GNTR: జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు శుభవార్త. సీఎం చంద్రబాబు శనివారం కర్నూలులో ప్రకటించినట్లు, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కానుంది. జిల్లాలో రోజూ 40 వేల మందికి పైగా మహిళలకు ‘సున్నా టికెట్’లు ఇస్తారు. దీంతో ఉపాధి, వైద్యం, కొనుగోళ్ల కోసం నగరానికి వచ్చే మహిళలకు ఈ నిర్ణయం ఊరటనిస్తుంది.