»Money Served In Place Of Tissues With Food In Ambanis Party
Money in Ambani’s party: అంబానీ ఇచ్చిన విందులో కరెన్సీ నోట్లు.. ఎందుకంటే
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇటీవల కుటుంబం ఇచ్చిన పార్టీలో ఢిల్లీ ప్రముఖ వంటకం దౌలత్ కీ చాట్ తో పాటు టిష్యూ పేపర్లకు బదులు రూ.500 నోట్ల కరెన్సీ నోట్లను ఉంచారు. అయితే ఇవి నకిలీవి.
ఆసియా కుబేరుడు, భారత ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కుటుంబం ఇటీవల ఓ గ్రాండ్ పార్టీని (Ambani family party) ఏర్పాటు చేసింది. రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) చైర్ పర్సన్ నీతా అంబానీ కలల ప్రాజెక్టు నీతా ముఖేష్ అంబానీ సాంస్కృతిక కేంద్రం (NMACC) ప్రారంభాన్ని పురస్కరించుకొని రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు విందు ఇచ్చింది. ఈ విందులో అతిథుల నోరు తీపి చేసేందుకు ఓ ప్రత్యేకమైన స్వీట్ వంటకాన్ని (Sweet) ఇచ్చారు. ఈ స్వీట్ కు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ మిఠాయితో పాటు కరెన్సీ నోట్లు (Currencty notes with sweet) కూడా అందులో ఉన్నాయి. కరెన్సీ నోట్లు కలిగిన స్వీట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో (Social Media) తెగ చక్కెర్లు కొడుతున్నాయి.
అలా ఎందుకు పెట్టారనే చర్చ సాగుతోంది. అతిథులకు వడ్డించేందుకు రెడీగా ఉంచిన డిజర్ట్ ఫోటో ఇది. ఇందులో గిన్నెలో ఆకు వేసి దాని పైన స్వీట్ ఉంచారు. ఈ వంటకం ఢిల్లీలో పాపులర్ దౌలత్ కి చాట్ (daulat ki chaat). ఈ వంటకం ఓల్డ్ ఢిల్లీ సహా ఉత్తర భారత దేశంలో శీతాకాలంలో మాత్రమే రెండు నెలల పాటు లభిస్తుంది. చిక్కటి పాల నుండి తీసిన నురుగుతో తయారు చేసి పైన పిస్తా, కోవా, చక్కెర పొడితో తయారు చేస్తారు. ఇందులో మంచి ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. అందుకే దీనిని దౌలత్ కీ చాట్ అంటారు. అలాంటి స్వీట్ పక్కన కరెన్సీ నోట్లను పెట్టారు. కానీ అవి నిజమైన కరెన్సీ నోట్లు కావు. టిష్యూ పేపర్ ప్లేస్ లో వీటిని ఇచ్చారు.
దౌలత్ కీ చాట్ అని ఈ స్వీట్ లో సంపద ఉండటంతో ఇండియన్ అసెంట్ అనే రెస్టారెంట్ ఈ డిజర్ట్ తో పాటు నకిలీ కరెన్సీ నోట్లను పెట్టి ప్రత్యేకంగా విక్రయిస్తోంది. దీంతో ఇది పాపులర్ గా మారింది. ఈ ప్రత్యేకమైన వంటకాన్ని అంబానీ ఫ్యామిలీ పార్టీలో కూడా అతిథులకు వడ్డించారు. అందులో కనిపించేవి నిజమైన కరెన్సీ నోట్లు కావు. అతిథులకు ఇచ్చిన విందులో పాలక్ పన్నీరు, పప్పు, కూర, రోటీ, హల్వా, డిజర్ట్, పాపడ్, లడ్డూ వంటి భారతీయ సంప్రదాయ వంటకాలను వడ్డించారు.