WNP: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం శ్రీరంగాపూర్ మండలం నగరాల సెంటర్ వన్లో ఉపాధి హామీ పథక కార్మికుల చట్టాలపై డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉత్తరయ్య అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. వేసవి తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలో వడదెబ్బ తాగకుండా టెంటు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉండాలని తెలియజేశారు. మత్తు పానీయాలకు దూరంగా ఉండాలన్నారు.