GDWL: ఇందిరమ్మ ఇండ్ల పనుల లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోశ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గద్వాల ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకం, ధ్యానం కొనుగోలు కేంద్రాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు అధికారులు పాల్గొన్నారు.