కడప: పోరుమామిళ్ల పట్టణంలోని లాడ్జీలలో శుక్రవారం సీఐ డీ.శ్రీనివాసులు తనిఖీ చేశారు. కొత్తవారు, అనుమానాస్పద వ్యక్తులు ఎవరన్నా ఈ మధ్యకాలంలో లాడ్జీలో చేరారా అని ఆరా తీశారు. ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే తమకు తెలపాలని లాడ్జీ యాజమాన్యానికి సూచించారు. వారితో SI కొండారెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.