NTR: విజయవాడ నగరాన్ని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని AIYF నగర కార్యదర్శి గోవిందరాజులు అన్నారు. శుక్రవారం ఈ మేరకు విజయవాడలో ఆయన మాట్లాడారు. కన్న కొడుకే తల్లిదండ్రులపై అమానుషంగా దాడికి పాల్పడిన ఘటనపై తక్షణమే పోలీసులు స్పందించి బాలాజీని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారన్నారు. గంజాయి అక్రమ రవాణా నిరోధించాలని కోరారు.