పహల్గామ్ ఉగ్రదాడిని G7 దేశాలు ఖండించాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనటంతో కీలక వ్యాఖ్యలు చేశాయి. ‘భారత్-పాక్ రెండూ సంయమనం పాటించాలి. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు. రెండు దేశాల్లో పౌరుల భద్రతపై ఆందోళన చెందుతున్నాం. శాంతిస్థాపనకు భారత్-పాక్ చర్చలు జరపాలి. ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాం’ అని పేర్కొన్నాయి.