అన్నమయ్య: సీఎం సహాయ నిధి పేదలకు వరమని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు. మంగళవారం ఓబులవారిపల్లె, రైల్వే కోడూరు, చిట్వేలు గ్రామాలకు చెందిన 5 మంది బాధితులకు రూ. 5,83,695 లక్షల విలువ గల చెక్కులను బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ బాసటగా సీఎం సహాయ నిధి నిలుస్తుందన్నారు.