NGKL: తూర్పు మిషన్లు, తరుగు పేరుతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అధికారులు రైతులను మోసం చేస్తున్నారని రైతు సంఘం మండల కార్యదర్శి బాలపిరు ఆరోపించారు. కొల్లాపూర్ మండలం నార్లాపూర్, ముక్కిడి గుండం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు సంఘం నేతలు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రానికి రైతులు ధాన్యం తీసుకొచ్చి 15 రోజులు అవుతున్న కొనుగోలు చేయడంలేదన్నారు.