TPT: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రైతులకు వ్యవసాయ పనిముట్లు అందిస్తోందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. యర్రావారిపాలెం మండలంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. అనంతరం 50 మంది రైతులకు సబ్సిడీ రూపంలో పనిముట్లను అందజేశారు.