KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసిలో మెగా టెక్స్ టైల్ పార్క్ నిర్మాణానికి ఇవాళ భూమి పూజ నిర్వహించారు. రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఫరూక్, రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్, బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖ మంత్రి సవితతో కలిసి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి భూమిపూజలో పాల్గొన్నారు. చేనేత రంగంపై ఆధారపడిన కార్మికులకు ఇది ఉపయోగకరమన్నారు.