ADB: రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగా పత్తి రైతులు నిలువునా మోసపోయారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఈ మేరకు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సమావేశమై మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ హస్తంతో ప్రయివేటు డీలర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రైతులకు కుచ్చుటోపీ పెట్టారని మాజీమంత్రి జోగు రామన్న ఆరోపించారు.