W.G: వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని ఎంఈవో ఎ.రవీంద్ర అన్నారు. సీసలి ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్‌ను ఆయన మంగళవారం ప్రారంభించారు. విద్యార్థులు క్యాంపు ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, క్రాఫ్ట్ వంటి రకరకాల కళలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు.