SRCL: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, పైసా అప్పు కూడా పుట్టడం లేదని, ఢిల్లీకి పోతే చెప్పులెత్తుకుపోతారేమనని దొంగలాగా చూస్తూ అపాయిట్ మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.