JGL: మెట్పల్లి మండలం వెల్లుల్లలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి రైతులు అక్కడి సమస్యలను విన్నవించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రాల్లో గన్ని సంచుల కొరతతో పాటు లేబర్ సమస్య చాలా ఉందన్నారు. ప్రభుత్వం అధికారులు రైతులకు సమస్యలు లేకుండా ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలని అన్నారు.