సరిహద్దుల్లో భద్రత బలోపేతంపై కేంద్రం దృష్టి సారించింది. కొత్తగా 16 BSF బెటాలియన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. బెటాలియన్లతో పాటు 2 ఫీల్డ్ హెడ్క్వార్టర్లను ఏర్పాటు చేయనుంది. ఈ విషయంపై హోంశాఖ, ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపనుంది. పాక్, బంగ్లా సరిహద్దుల వెంబడి BSF గస్తీ చేపట్టనుంది. ఇప్పటికే BSFకు 193 బెటాలియన్ల సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.