SRD: సిర్గాపూర్ మండలం వరప్రదాయని నల్లవాగు సాగునీటి ప్రాజెక్టుకు 1506 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందని ఇరిగేషన్ అధికారులు శనివారం ఉదయం తెలిపారు. అదేవిధంగా ప్రాజెక్టు అలుగు ద్వారా కూడా 1506 క్యూసెక్కులు దిగువకు పారుతూ, నదిలో కలుస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1493 స్వీట్లు కాగా 1493.5 ఫీట్ల వద్ద జలాలు స్టోరేజ్ ఉందన్నారు.