KMM: పన్నుల చెల్లింపునకు ఎర్లీ బర్డ్ స్కీం బుధవారంతో ముగుస్తుందని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. ఇప్పటి వరకు ఈ స్కీం ద్వారా 12,664 మంది పన్నులు చెల్లించగా వారందరికీ 5 శాతం రాయితీ వర్తించిందన్నారు. ఇప్పటి వరకు రూ.7.61 కోట్లు పన్నులు వసూలయ్యాయన్నారు. ఇంకా 2 రోజులు మాత్రమే పథకానికి గడువు ఉండటంతో నగర వాసులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.