NRPT: గన్ని బ్యాగుల కొరత తీర్చి వరి ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి మంగళవారం ప్రకటనలో అధికారులను కోరారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్ని రకాల కష్టాలు వున్నాయని, గన్ని బ్యాగుల కొరకు రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. జిల్లాలో 37 లక్షల గన్ని బ్యాగులు అవసరమని అన్నారు.