ప్రధాని మోదీ దేశ ప్రజలకు పరశురామ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆయుధ కళలు.. వేద, ధర్మ శాస్రాల్లో పరశురాముడు నిష్ణాతుడు. అందువల్లే ఆయుధ, శాస్త్రవిద్యల జ్ఞానం కోసం ఆయన్ని పూజిస్తాం. భగవాన్ పరశురాముడి కృపలో ప్రతి ఒక్కరి జీవితాలు ధైర్యంతో నిండిపోవాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు X ఖాతాలో పోస్టు పెట్టారు.