TPT: శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి జిల్లాలోని వివిధ ప్రదేశాలలో అమర్చేందుకు రూ. 10 లక్షల విలువైన 150 సోలార్ కెమెరాలను కొనుగోలు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. కెమెరాలు సౌరశక్తితో పనిచేస్తాయని, ఇవి పర్యావరణానికి అనుకూలంగా ఉండటంతో పాటు అడ్వాన్స్ ఫీచర్స్ కలిగి ఉన్నాయన్నారు. వీటి ద్వారా అసాంఘిక కార్యక్రమాలపై నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.